చిరంజీవి గారు మెసేజ్ చేసారు

తెలుగు చలన చిత్ర రంగం ఈ మధ్య కాలంలో పలు విభిన్న ప్రయోగాలకు వేదికవుతూ, ప్రేక్షకులను కొత్త అనుభవాలతో అలరిస్తోంది. ఈ క్రమంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో, శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్ చిత్రం తెలుగు సినీ పరిశ్రమలో కొత్త చరిత్రను సృష్టించబోతుందనే అంచనాలు ఉన్నాయి.

విపరీతమైన హైప్

డైరెక్టర్ శంకర్ గురించి ప్రత్యేకంగా ఏమని చెప్తాం.. ఆయన ప్రతి సినిమా వెనుక ఒక డిఫరెంట్ కథాంశం ఉంటుంది. అటువంటి దర్శకుడితో ఇప్పుడు రామ్ చరణ్ పని చేయడం అంటే అది ప్రేక్షకులకు ప్రత్యేకమైన పండుగ. ఈ మూవీలో రామ్ చరణ్ మూడు ప్రధాన పాత్రలను పోషిస్తున్నట్లు సమాచారం. ఒక ఐఏఎస్ అధికారి, పోలీసు అధికారిగా మాత్రమే కాకుండా, రాజకీయ నాయకుడి పాత్రలో కూడా ఆయన కనిపించనున్నారు. ఈ మూడు పాత్రలు చిత్రానికి వెన్నెముకలా నిలుస్తాయని చిత్ర యూనిట్ చెబుతున్నారు.

చిరంజీవి మెసేజ్

అప్పట్లో ‘ఆర్ ఆర్ ఆర్’ తో వరల్డ్ వైడ్ గా గుర్తింపు పొందిన రామ్ చరణ్ ఈ సినిమాలో తన నటనతో మరోసారి అలరిస్తారు. చిత్ర నిర్మాత దిల్ రాజు విజయవాడలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఈవెంట్‌లో పాల్గొని, చిరంజీవి గారి సందేశాన్ని అభిమానులతో పంచుకున్నారు. చిరంజీవి గారు ఈ సినిమా సినిమా చూసి నాకు మెసేజ్ చేసారు, “ఇది కేవలం సినిమా మాత్రమే కాదు; ఈ సంక్రాంతికి ఒక సంచలనం” అని తెలిపారు.

సంక్రాంతి విడుదల

‘గేమ్ చేంజర్’ చిత్రాన్ని 2025 సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10న విడుదల చేస్తున్నారు. ఈ పండగ సీజన్ తెలుగు సినిమాలకు పెట్టింది పేరు. ఇదే సమయంలో ఇంకా ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు బరిలోకి దిగనున్నాయి.

ఈ సినిమాకి సంగీత దర్శకుడు తమన్ అందించిన పాటలు ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ పాటలు, మేకింగ్ స్టాండర్డ్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్ చిత్రీకరణలో అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించారని, అది ప్రేక్షకులను అబ్బురపరుస్తుందని శంకర్ తెలిపారు.

రామ్ చరణ్ కొత్త హైట్స్

‘ఆర్ ఆర్ ఆర్’తో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్‌గా మారారు. ఇప్పుడు ‘గేమ్ చేంజర్’తో ఈ స్థాయి మరింత పటిష్టం కానుంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ డిఫరెంట్ పాత్రలు, ఆయన శారీరక భాష, ఎమోషనల్ డెప్త్ సినిమాలో ప్రత్యేకంగా ఉంటాయని అనుకుంటున్నారు.

ఈ చిత్రానికి సంబంధించిన తొలి లుక్, పాటలు, ఇతర ప్రచార కార్యక్రమాలు ఇప్పటికే ప్రేక్షకులలో భారీ ఆసక్తిని రేకెత్తించాయి. ఇటీవల విజయవాడలో రామ్ చరణ్ 256 అడుగుల కటౌట్ ఏర్పాటు చేశారు, ఇది అభిమానుల ఆసక్తిని మరింత పెంచింది. ప్రపంచంలోనే అతిపెద్ద కటౌట్‌గా అది ప్రత్యేక గుర్తింపును సాధించింది.

తెలుగు సినిమా స్థాయిని మరింత పెంచే ప్రయత్నంలో గేమ్ చేంజర్ ఒక కీలకమైన అడుగు. 2025 సంక్రాంతి ఈ సినిమాతో మరింత వేడుకగా మారనుంది.

Leave a Comment