గేమ్ ఛేoజర్ | ఫస్ట్ రివ్యూ ఇచ్చిన SJ సూర్య

గేమ్ ఛేoజర్ ఇండియా గర్వించదగ్గ దర్శకుడిగా శంకర్ నెలకొలిపిన రికార్డులు అన్ని ఇన్ని కావు. భారతీయ సినిమాకు భారీతనాన్ని నేర్పిన దర్శకుడు. ఆయన కొన్ని ఏళ్ల క్రితమే వందల కోట్ల బడ్జెట్ మూవీని తెరకెక్కించారు. సోషల్ సబ్జెక్ట్ కి కమర్షియల్ అంశాలు జోడించి తెరకెక్కించడంలో ఆయన దిట్ట.


ఇక శంకర్ డైరెక్ట్ చేసిన పొలిటికల్ డ్రామా ‘ఒకే ఒక్కడు’ ట్రెండ్ సెట్టర్.
ఈ మూవీ లోని ఒక్క రోజు ముఖ్యమంత్రి కాన్సెప్ట్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది.
ఆ మూవీ విడుదలై ఇరవై ఏళ్ళు దాటిపోయింది ఇన్నేళ్లకు మళ్ళీ శంకర్ Game Changer టైటిల్ తో పొలిటికల్ కమర్షియల్ మూవీని తెరకెక్కిస్తున్నారు.

గేమ్ ఛేoజర్

గేమ్ ఛేoజర్


ఎక్కువగా ఆయన తమిళ్ హీరోలతోనే వర్క్ చేసారు.
ఫస్ట్ టైం టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్ కి డైరెక్ట్ చేస్తున్నాడు.
గేమ్ చేంజర్ మూవీలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్న సంగతి తెలిసిందే, ఒక పాత్రలో ఆయన రాజకీయ నాయకుడిగా మరో పాత్రలో ఐఏఎస్ అధికారిగా కనిపిస్తున్నారు.


రామ్ చరణ్ ఈ సినిమాలో పంచెకట్టుతో కనిపిస్తున్నారు.
ఆయన పిరియాడిక్ లుక్ బాగుంది.
ఇందులో హీరోయిన్స్ గా
కియార్ అద్వాని మరియు అంజలి నటిస్తున్నారు. సునీల్, ఎస్ జే సూర్య, శ్రీకాంత్ కీలక రోల్స్ చేస్తున్నారు.

తమన్ మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెలిసిందే, మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సంక్రాంతి రేస్ నుంచి తప్పుకోగా గేమ్ చేంజర్ జనవరి ఫస్ట్ వీక్ లో విడుదల కానుంది.

ఎస్ జే సూర్య రివ్యూ

వరల్డ్ వైడ్ గా 5 భాషల్లో ఈ గేమ్ చేంజర్ మూవీ విడుదల కానుంది. ఎస్ జే సూర్య గేమ్ చేంజర్ మూవీలో ప్రధాన విలన్ రోల్ చేస్తున్నారు.

గేమ్ ఛేoజర్ పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్న నేపథ్యంలో ఆయన డబ్బింగ్ చెప్తున్నారట, ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలియజేశారు.
ఈ సినిమా పై ఒక షార్ట్ రివ్యూ కూడా ఇచ్చేసారు.

“హాయ్ ఫ్రెండ్స్ గేమ్ చేంజర్ మూవీ లోని రెండు కీలక సన్నివేశాలకు డబ్బింగ్ పూర్తి చేశాను. ఒక సన్నివేశం రామ్ చరణ్ తో మరొక సన్నివేశం శ్రీకాంత్ తో జరిగింది. దీనికి మూడు రోజుల సమయం పట్టింది అవుట్పుట్ మాత్రం దిమ్మ తిరిగి బొమ్మ కనబడుతుంది అన్న రేంజ్ లో ఉంది థియేటర్ లో మామూలు రెస్పాన్స్
ఉండదు నాకు అది ముందే కనిపిస్తోంది థాంక్యూ శంకర్ గారు దిల్ రాజ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. సంక్రాంతికి రామ్ చరణ్ దెబ్బకు థియేటర్స్ దద్దరిల్లడం ఖాయం మళ్ళీ కలుద్దాం.”
అని ఎస్ జే సూర్య ట్వీట్ చేశాడు.

ఆయన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి ఎస్ జే సూర్య షార్ట్ రివ్యూ రామ్ చరణ్ ఫ్యాన్స్ లో జోష్
నింపింది. మూవీ చాలా బాగా వచ్చిందనే నమ్మకం ఏర్పడింది. గేమ్ చేంజర్ తో రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్.

మరింత సమాచారం కోసం ఈ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి

Leave a Comment