మంచు మనోజ్ పై ఎవరు దాడి చేశారు?

మంచు మనోజ్ పై ఎవరు దాడి చేశారు?

మంచు మనోజ్ పై ఎవరు దాడి చేశారు?: మంచు ఫ్యామిలీ లో కుటుంబ కలహాలు రోజు రోజుకి అంతులేకుండా పెరిగిపోతున్నాయి.

మంచు మనోజ్ ఈ మధ్య ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో గాయాలతో కనిపించారు. వివరాల ప్రకారం తన తండ్రితో విభేదాలే కారణమని అని తెలుస్తోంది.

మంచు మనోజ్ మరియు తన భార్య భూమా మౌనిక మిగతా సెక్యూరిటీ సిబ్బందితో హాస్పిటల్ నుంచి బయటికి వస్తున్న దృశ్యాలు రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి

రీసెంట్గా విడుదలైన ఒక వైరల్ వీడియోలో మంచు మనోజ్ తన మెడ చుట్టూ ఒక cervical collar వేసుకుని సిబ్బంది సహాయంతో చాలా కష్టంతో నడుచుకుంటూ వస్తున్నారు.
మీడియా కథనం ప్రకారం.. కొంత మంది తెలియని వ్యక్తులు అతని మీద దాడి చేసారని తెలియజేస్తున్నారు . మనోజ్ ఆదివారం హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు.

మంచు మనోజ్ పై ఎవరు దాడి చేశారు?

 

మీడియాలో మరో విషయం చక్కెర్లు కొడుతోంది.. మోహన్ బాబు అనుచరులే మనోజ్ ను కొట్టారని తర్వాత ఒకరి మీద ఒకరు పోలీసు కంప్లైట్స్ చేసుకున్నారని.. అయితే మంచు ఫ్యామిలీ ఈ వార్తలను తోసి పుచ్చింది. తండ్రి కొడుకులు ఏ విధమైన పోలీసు కంప్లైట్స్ చేసుకోలేదని, ఇవన్నీ అవాస్తవమని అన్నారు.

పోలీస్ కంప్లైంట్

పోలీసులు ఇస్తున్న సమాచారం ఏమిటంటే… “మాకు వారి ఇంటి దగ్గర నుండి కాల్ వచ్చింది కానీ ఈ ఇన్సిడెంట్ గురించి ఎవరూ ఏ కంప్లయింట్ ఇవ్వలేదని ఇది వారి ఫ్యామిలీ ఇష్యూస్” అని తెలియజేశారు.

రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ ఫస్ట్ రివ్యూ

ఈ మధ్య మంచు ఫ్యామిలీ కుటుంబ కలహాలతో మీడియాలోనే ఎక్కువగా కనిపిస్తోంది.
ఆ మధ్య మోహన్ బాబు పెద్ద కొడుకు మంచు విష్ణు చిన్నకొడుకు మనోజ్ మధ్య జరిగిన గొడవలు వైరల్ అయ్యాయి.

తన తండ్రి తో ఏవైనా తగాదాలు ఉన్నాయా అని మీడియా ప్రశ్నిస్తే మంచు మనోజ్ మాత్రం ఏవిధమైన సమాధానం ఇవ్వలేదు.

ప్రస్తుతం మనోజ్ మిరాయ్, భైరవం, What the Fish చిత్రాలలో నటిస్తున్నారు.

 

Leave a Comment