Keerthy Suresh Weds Antony Thattil: ఒకటైన కీర్తిసురేష్ ఆంటోనీ జంట. గోవాలో అంగరంగ వైభవంగా స్నేహితులు సన్నిహితుల మధ్య వివాహం జరిగింది.
కీర్తి సురేష్ ఆంటోనీలు పదిహేను ఏళ్లగా ప్రేమలో ఉన్నారు.
ఇరుకుటుంబాల ఆమోదంతో (డిసెంబర్ 12) న గోవాలో వీరి వివాహం జరిగింది.
ఆంటోనీ కి asperos అనే ఇంటీరియర్ డిజైనింగ్ వ్యాపార సంస్థ ఉంది. ఇంకా పలు రకాల వ్యాపారాలలో ఉన్నారు.
ప్రేమ వివాహం
వీరి ప్రేమ ప్రయాణం ఇంటర్మీడియట్ నుండి ప్రారంభం అయింది. కాలేజీ డేస్ నుండి మంచి స్నేహితులుగా ఉన్న వీరు.. క్రమంగా వారి అభిరుచులు మనస్తత్వాలు ఏకం కావడంతో కెరీర్ లో సెటిల్ అయ్యాక వివాహం చేసుకుందామని నిశ్చయించుకున్నారు.
కీర్తీసురేష్ దీపావళి రోజున తన Instagram లో ఇద్దరు కలిసి ఉన్న ఒక పోస్ట్ పెట్టారు.. “మా ప్రేమ కి 15 సంవత్సరాలు నిండాయి.. ఇంకా కొనసాగుతోంది” అని దీనితో అతను ఎవరా అని నెట్టింట్లో వైరల్ అయ్యింది.
FOLLOW: లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి
పెళ్లి అయ్యాక కీర్తి సురేష్ సినిమాలలో నటిస్తారా? నటించరా? అనేది ఇంకా తెలియదు.
నటి సావిత్రి జీవిత కథాంశంతో తెరకెక్కిన చిత్రం మహానటి. ఇందులో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ అద్భుతంగా నటించి అందరినీ అబ్బురపరచారు.
ఈ సినిమా లో తన నటనకి గాను 2019 లో ఉత్తమ నటిగా నేషనల్ అవార్డు అందుకున్నారు.
తను తెలుగు, తమిళం, కన్నడ, మళయాల చిత్రాలలో నటించారు. ప్రస్తుతం కీర్తి సురేష్ BabyJohn అనే మూవీతో బాలీవుడ్ లోకి అరగ్రేటం చెయ్యనున్నారు. ఇందులో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 25 క్రిస్మస్ రోజున విడుదల కానుంది.