Realme 14x 5G

Realme 14x 5G: రియల్మీ కంపెనీ తమ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ Realme 14x 5G ను India లో డిసెంబర్ 18, 2024, మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేస్తోంది.  అతి తక్కువ ధరతో దీనిని అందుబాటులోకి తీసుకురానున్నారు. ₹14,000 రూపాయల రేంజ్ లో అందుబాటులోకి రానున్న ఈ స్మార్ట్‌ ఫోన్, భారత మార్కెట్‌ లో అత్యంత తక్కువ బడ్జెట్లో 5G మొబైల్ గా నిలవనుంది.

realme 14x 5G

డిస్ ప్లే మరియు డిజైన్

Realme 14x 5G ఫోన్ 6.67 HD+ మరియు IPS LCD డిస్‌ ప్లే తో వస్తోంది. 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉన్న ఈ ఫోన్లో గేమ్స్ ఆడటానికి మరియు మూవీస్ చూడటానికి మంచి ఫీల్ అందిస్తుంది. ఈ ఫోన్ మూడు కలర్స్ లో అందుబాటులో ఉన్నాయి అవి Crystal Black, Golden Glow మరియు Jewel Red. ఈ ఫోన్ బ్యాక్ సైడ్ మంచి ఫినిషింగ్ తో మెరుస్తూ చూడటానికి ఆకర్షణీయంగా ఉంటుంది.

realme 14x 5G

ప్రాసెసర్

Realme 14x 5G Mediatek ప్రాసెసర్ 6300 తో వర్క్ అవుతుంది, ఈ బడ్జెట్ లో ఇలాంటి ప్రోసెసర్ బెస్ట్ అనే చెప్పాలి.

మెమోరీ

Realme 14x 5G లో 6 GB మరియు 8 GB RAM రెండు వేరియంట్స్ ఉన్నాయి, అలాగే 128GB మరియు 256GB రెండు స్టోరేజ్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. అదనంగా, 10 GB వర్చువల్ RAM ఉంది, దీని ద్వారా ఫోన్ యుసేజ్ లో లాగ్ ఉండదు మరియు ఉత్తమమైన పని తీరుని కనబరుస్తుంది.

realme 14x 5G

బ్యాటరీ

Realme 14x 5G లో 6,000mAh పవర్ఫుల్ బ్యాటరీ యూజ్ చేసారు మరియు 45W వేగవంతమైన ఛార్జింగ్ ను సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్‌ ను 50% వరకు ఛార్జ్ చెయ్యాలంటే కేవలం 38 నిమిషాల్లో ఛార్జ్ చేయగలదు.  మరియు ఫుల్ ఛార్జ్‌ చెయ్యాలంటే సుమారుగా గంటన్నర సమయం అవసరం అవుతుంది.

కెమెరా

ఈ Realme 14x 5G లో రెండు కెమెరా సెటప్స్ ఉన్నాయి. ఇందులో బ్యాక్ కెమెరా 50-మెగాపిక్సెల్  Ai సెన్సార్ తో వస్తోంది. దీని వలన క్లారిటీతో పాటు మంచి ఫొటోస్ తీయడానికి ఉపకరిస్తుంది. ఫ్రంట్ కెమెరా గురించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

realme 14x 5G

సేఫ్టీ

సేఫ్టీ ప్రొటెక్షన్ విషయానికొస్తే ఈ ఫోన్ IP69 రేటింగ్ తో వస్తోంది, ఇది డస్ట్ మరియు వాటర్ ప్రొటెక్టర్ కలిగి ఉంది. ఈ ప్రైస్ రేంజ్ లో ఇలాంటి ఫీచర్ అందించడం ఇదే మొదటిసారి.

సాఫ్ట్‌వేర్

Realme 14x 5G రియల్మి UI 5.0 సాఫ్ట్ వేర్ తో ఆండ్రాయిడ్ 14 వెర్షన్ పై నడుస్తుంది. ఇది ఆధునిక ఫీచర్లతో మెరుగైన పనితీరుతో పాటు న్యూ సాఫ్ట్వేర్ అప్డేట్‌లను అందిస్తుంది.

కంక్లూజన్

మొత్తానికి Realme 14x 5G  భారతీయ వినియోగదారుల కోసం తక్కువ బడ్జెట్ లో స్మార్ట్‌ఫోన్ ప్రవేశపెడుతోంది, ఇది 5G కనెక్టివిటీ, పవర్ఫుల్ ప్రాసెసర్, మంచి బ్యాకప్ బ్యాటరీ, మరియు అత్యుత్తమ డిస్‌ప్లే అనుభవాన్ని అందిస్తోంది, ఈ బడ్జెట్ లో ఆధునిక ఫీచర్లతో బెస్ట్ మొబైల్ గా నిలుస్తోంది. డిసెంబర్ 18న ఈ ఫోన్ లాంచ్ అవ్వబోతోంది. Flipkart మరియు Realme వెబ్సైట్ల నుండి ఈ మొబైల్ కొనుగోలు చెయ్యవచ్చు. లాంచ్ అయిన తరువాత, మరిన్ని వివరాలు తెలియజేయబడతాయి.

Leave a Comment